Medchal ACP: ఆమె చేతిపై శ్రీకాంత్, నరేందర్‌ అని రాసి ఉంది

by Gantepaka Srikanth |   ( Updated:2025-01-24 15:03:51.0  )
Medchal ACP: ఆమె చేతిపై శ్రీకాంత్, నరేందర్‌ అని రాసి ఉంది
X

దిశ, వెబ్‌డెస్క్: మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌(Munirabad)లో వివాహిత దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం కొందరు గుర్తు తెలియని దుండగులు బండరాళ్లతో తలపై బలంగా మోది అతి కిరాతకంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్(Medchal ACP Srinivas).. పోలీసుల బృందంతో స్పాట్‌కు వచ్చారు. హత్య జరిగిన తీరుపై ఆరా తీశారు. వివాహితను బండరాయితో కొట్టిచంపి.. గుర్తుపట్టలేనంతగా కాల్చేశారని అన్నారు. అంతేకాదు.. మృతురాలి చేతిపై శ్రీకాంత్, నరేందర్‌ అని రాసి ఉందని గుర్తించారు. ఆమెపై అత్యాచారం జరిగిందో లేదో పోస్టుమార్టంలో తెలుస్తుందని వెల్లడించారు. హత్యకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story