- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నస్పూర్ లో పట్టపగలే భారీ చోరీ
రూ.15 లక్షల నగదు, 21 తులాల బంగారం, 40 గ్రాముల వెండి అపహరణ
దిశ, నస్పూర్ : నస్పూర్ పట్టణంలోని లోని తీగల్పహాడ్ లక్ష్మి ఎంక్లేవ్ నివాస సముదాయంలో మంగళవారం పట్టపగలే భారీ దొంగతనం జరిగింది. బాధితుడు భాకం రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. వేసవి సెలవులు కావడంతో కుటుంబ సభ్యులు ఊరికి వెళ్లారని, తను పని నిమిత్తం ఉదయం 11:30 కు ఇంటి నుంచి బయటకు వెళ్లి మధ్యాహ్నం 3 గంటలకి ఇంటికి వచ్చే సరికి మెయిన్ డోర్ తెరిచి ఉండడంతో ఇంట్లో దొంగలు పడ్డారన్న విషయాన్ని గుర్తించానని తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఇంట్లోని బీరువాలో ఉన్న రూ.15 లక్షల నగదు, 21 తులాల బంగారం, 40 గ్రాముల వెండి దొంగలు అపహరించినట్లు తెలిపారు.
బాధితుడు వృత్తిరీత్య ప్రముఖ వ్యాపారి కావడంతో భారీగా నగదు, బంగారం దొంగలు దోచుకెళ్లారని స్థానికులు వాపోతున్నారు. సమాచారం అందుకున్న సీసీసీ నస్పూర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం, ఫింగర్ ప్రింట్ బృందాలు ఆధారాలను సేకరించాయి. ఘటనా స్థలాన్ని సందర్శించిన వారిలో మంచిర్యాల డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఏసీపీ తిరుపతిరెడ్డి, సీఐ టి.సంజీవ్, ఎస్సై రవికుమార్, సీసీఎస్ ఎస్సైలు రాజబాబు, కొమురయ్య, తదితర సిబ్బంది ఉన్నారు. దొంగతనానికి పాల్పడిన వారి కోసం పోలీసు బృందాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.