Encounter: భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి

by Gantepaka Srikanth |
Encounter: భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌ఘడ్‌లోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్(Encounter) జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టు(Maoists)లకు మధ్య శనివారం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ఘటనా స్థలంలో మృతదేహాలతో పాటు భారీగా ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతుల్లో రూ.8 లక్షల రివార్డు ఉన్న కమాండర్(Commander) ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇంకా కూంబింగ్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బీజాపూర్(Bijapur) అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమయ్యారని తమకు వచ్చిన సమాచారం మేరకు కూంబింగ్ నిర్వహించామని స్థానిక ఎస్పీ వెల్లడించారు.

Advertisement

Next Story