నదిలో దూకి వివాహిత మృతి

by Kalyani |
నదిలో దూకి వివాహిత మృతి
X

దిశ, అలంపూర్ టౌన్: అలంపూర్ సమీపంలోని తుంగభద్ర నదిలో దూకి వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. మృతురాలిని బొంకూరు గ్రామానికి చెందిన హారిక గా గుర్తించారు. ఈనెల 8 తేదీన ఉండవల్లి పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు అయింది. ఉండవెల్లి మండలం బొంగురు గ్రామానికి చెందిన హారిక(42) శ్రీశైలం వెళ్తున్నానని చెప్పి అలంపూర్ సమీపంలోని ర్యాలంపాడు వంతెన పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. నదిలో పోలీసులు గాలింపు చేపట్టగా శనివారం మృతదేహం లభించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.

Advertisement

Next Story