- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వీడని గురుకుల విద్యార్థిని నిఖిత మృతి మిస్టరీ
దిశ, అచ్చంపేట : మన్ననూర్ గ్రామంలో గల సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యార్థిని నిఖిత ఈనెల 6న అనుమానాస్పదంగా హ్యంగింగ్ చేసుకొని మృతి చెందిన సంఘటన పై రోజుకో ట్విస్ట్ సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. విద్యార్థి మృతిపై అటు తల్లిదండ్రులకు బయటి ప్రపంచానికి ఎలాంటి సమాచారం రాకపోవడంతో ఇంకా మిస్టరీగానే ఉంది. ఒక సున్నితమైన అంశాన్ని కొందరు సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకొని గురుతరమైన ఉపాధ్యాయ వృత్తిపై తప్పుడు ప్రచారాలకు తెరలేపడంతో అందరూ ముక్కున వేలు వేసుకునే విధంగా అలాంటి ప్రచారం చేయడం తగదని విమర్షలు చేస్తున్నారు.
ప్రేమ వ్యవహారం ఎవరిది..!
గురుకుల పాఠశాలలో అనుమానాస్పదంగా ఏడవ తరగతి విద్యార్థి నిఖిత మృతి చెందిన సంఘటన అటు కుటుంబ సభ్యులకు, బంధువులకు, సమాజానికి అంతులేని ప్రశ్నలను మిగిల్చాయి. వాటన్నిటికీ సమాధానం దొరకక.. కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు, ప్రతిపక్షాలు నిజాలు బయటకి రాకుండా ఎందుకు దారుణానికి ఒడిగట్టారని ఆరోపిస్తున్నారు. గురుకుల పాఠశాలలో ఏం జరిగి ఉంటుంది? అంత చిన్న వయసు విద్యార్థిని ఊహించని విధంగా ఆత్మహత్య చేసుకోవాలని ఎందుకు అనుకున్నది ? చేసుకోవాల్సిన అవసరం ఏమున్నది ? విద్యార్థి మరణం తర్వాత తనపై వస్తున్న ప్రేమ వ్యవహారం ఆరోపణలో నిజమెంత? వాస్తవాలు ఉంటే ఎందుకు కప్పిపుచ్చుతున్నారు? ప్రేమ వ్యవహారం ఇంకెవరిదైనా ఉన్నదా ? ఆరోజు మృతి చెందిన విద్యార్థి మరో విద్యార్థి ఏదో చూశారని జరుగుతున్న ప్రచారం నిజమేనా ? ఆ క్రమంలో విద్యార్థులు పరిగెడుతున్న సమయం లో నిఖిత గోడకు తగిలి గాయం అయిందా ?
ఒకవేళ గాయపడిన విద్యార్థి అక్కడే మృతి చెందిందా ? మృతి చెందిన తర్వాత ఆ విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారా ? ఒకవేళ చూసి ఉంటే ఆ విషయం బయటకి పొక్కకుండా ఏమైనా జరిగి ఉంటుందా ? విద్యార్థిని అంత్యక్రియల తర్వాత తప్పుడు ప్రచారం ఎందుకు పుట్టింది ? అదే నిజమైతే ఎందుకు పోలీసులకు సమాచారం ఇవ్వలేదు ? కేసు ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు ప్రిన్సిపాల్ ఏ విధంగా మృతి చెందిన విద్యార్థి పై తప్పుడు వ్యాఖ్యలు చేస్తుంది ? కడుపు కోతతో ఉన్న తల్లిదండ్రులకు తప్పుడు ప్రచారాలతో మరింత మానసిక శోభకు గురి చేయడం సమంజసమేనా ? ఇలా అనేక ప్రశ్నలకు సమాధానం అటు తల్లిదండ్రులకు ఇటు సమాజానికి తెలియాల్సి ఉంది.
సామాజిక మాధ్యమాలలో..
విద్యార్థి నిఖిత మృతి మృతి తర్వాత సామాజిక మాధ్యమాల వేదికగా పలు అనుమానాలకు తావిచ్చేలా ప్రచారాలు జోరుగా చేస్తాయి. విద్యావ్యవస్థలో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు అనేక అనుమానాలు రావడం సహజమే.. కానీ సున్నితమైన అంశాన్ని సామాజిక మాధ్యమాలలో గురుతల ఉపాధ్యాయులపై ఏదో చేశారని సమాజాన్ని తప్పుదోవ పట్టించడం అలాగే తల్లిదండ్రులకు మరింత మానసిక క్షోభకు గురి చేయడం ముమ్మాటికి తప్పిదమే. సామాజిక మాద్యమాలలో తప్పుడు ప్రచారం జరుగుతున్న విషయంపై స్థానిక పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిసింది. అలాంటి వ్యక్తులను చట్టపరంగా శిక్షించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారని సమాచారం.
సిట్టింగ్ జడ్జి విచారణ..
విద్యార్థిని నికిత మృతిపై తల్లిదండ్రులకు, సమాజానికి, ప్రజా సంఘాలకు పలు అనుమానాలు ఉత్పన్నమవుతున్న సందర్భంలో విద్యార్థి మృతిపై సిట్టింగ్ జడ్జిచేత సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రిన్సిపాల్ లలితా కుమారితో పాటు క్లాస్ టీచర్ గీతారాణిపై కూడా తక్షణ చర్యలు తీసుకోవాలని ఏకపక్షంగా ప్రిన్సిపాల్ పై వేటు వేయడం తగదని, దోషులను కఠినంగా శిక్షించాలని విద్యార్థిని తల్లిదండ్రులు బంధువులు ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.