అధికవడ్డిల ఆశతో కోట్ల రూ.మోసం చేసిన వ్యక్తి ఆత్మహత్య...

by Kalyani |
అధికవడ్డిల ఆశతో కోట్ల రూ.మోసం చేసిన వ్యక్తి ఆత్మహత్య...
X

దిశ, తూప్రాన్ : అధిక వడ్డీల ఆశ చూపి పలువురి నుంచి కోట్లు తీసుకుని పారిపోయిన బిజిలి పురం యాదగిరి సోమవారం రోజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత కొన్ని నెలల క్రితం తూప్రాన్ పట్టణానికి చెందిన బీజిలిపురం యాదగిరి అనే వ్యక్తి అధిక వడ్డీల ఆశ చూపి కోట్లు తీసుకుని పారిపోగా బాధితుల ఫిర్యాదు తో కేసు నమోదు చేసి పోలీసులు పట్టుకుని రిమాండ్ కి తరలించారు.కొన్ని రోజుల క్రితం యాదగిరి జైలు నుంచి విడుదల అయి తిరిగి వచ్చాడు. విషయం తెలుసుకున్న బాధితులు డబ్బుల అడగగా సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Advertisement

Next Story