12వ అంతస్తు నుంచి కొడుకును తోసేసిన తండ్రి..

by Hamsa |   ( Updated:2023-01-28 09:42:19.0  )
12వ అంతస్తు నుంచి కొడుకును తోసేసిన తండ్రి..
X

దిశ, వెబ్ డెస్క్: పూణేలో విషాద ఘటన చోటు చేసుకుంది. వాకాడ్‌లో ఓ వ్యక్తి తన 16 ఏళ్ల కొడుకును 12వ అంతస్తు నుంచి తోసేశాడు. ఆ తర్వాత తాను దూకేసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఇద్దరు మానసిక స్థితి సరిగా లేక చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story