రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం...

by Aamani |   ( Updated:2024-11-11 06:35:23.0  )
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం...
X

దిశ,తూప్రాన్ : పని నిమిత్తం తూప్రాన్ కి వెళ్లి తిరిగి సొంత గ్రామానికి టీవీఎస్ ఎక్సెల్ బైక్ పై వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొట్టింది. దీంతో వ్యక్తి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయిన ఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం తతాబాపన్ పల్లి గ్రామానికి కర్రీ మల్లేష్ (60) పని నిమిత్తం తూప్రాన్ కి వెళ్లి పని ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. ఈ క్రమంలో శివశక్తి ఫంక్షన్ హాల్ సమీపంలో వెనక నుండి వచ్చిన అబోతు పల్లి గ్రామానికి చెందిన ప్రశాంత్ అనే వ్యక్తి కారు బలంగా ఢీ కొనడంతో తీవ్ర రక్త గాయాలయ్యి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు.సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి విచారణ చేపట్టారు.

Advertisement

Next Story