రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..

by Kalyani |
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..
X

దిశ, అయిజ: జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం వెంకటాపూర్ సమీపంలో కర్నూలు, రాయచూరు రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. అయిజ మండలం ఉప్పల గ్రామానికి చెందిన నగేష్ (55) కర్నూలు నుంచి ఉప్పల గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళుతున్నాడు. ఈదురు గాలులతో కూడిన తేలికపాటి వర్షం కురవడంతో వాహనం అదుపుతప్పి కిందపడి తలకు బలమైన గాయాలయ్యాయి. క్షతగాత్రుడుని కర్నూలు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.

Advertisement

Next Story