- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
దిశ, నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ నగర శివారులోని కాలురు ఖానాపూర్ ఇండస్ట్రీయల్ ఏరియా వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న కార్మిక నాయకుడు దుర్మరణం. కాలూర్ కు చెందిన సరికెల గోపికృష్ణ(30) శుక్రవారం రాత్రి 11 లకు తన బైక్ పై నిజామాబాద్ కు వచ్చి తిరిగి గ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యలో కాలూర్ శివారులో అదుపు తప్పి కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో గోపికృష్ణ తలకు తీవ్ర గాయాలు కాగా, అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
భార్య సరికల గౌతమి ఫిర్యాదు మేరకు నిజామాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద ఘటనపై పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఇండస్ట్రీయల్ ఏరియాలో రెండు నెలలుగా సీసీ కెమెరాలు పని చేయడం లేదనే విషయాన్ని ఆలస్యంగా గుర్తించారు. గోపికృష్ణ తనంతట తానుగా కింద పడ్డాడా... మరేదైనా వాహనం ఢీకొట్టిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కార్మిక నాయకుడిగా ఉన్న గోపికృష్ణ మరణం పట్ల కార్మిక సంఘాల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.