- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి..
X
దిశ, కీసర : గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారంలో చోటుచేసుకుంది. సీఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం బీహార్ కు చెందిన షియా శరన్ రాయ్ (37) గత కొద్ది రోజులుగా నాగారం మున్సిపల్ పరిధిలోని సుర్వి బాబయ్య ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న మార్బుల్ షాప్ లో పనిచేస్తున్నాడు.
రోజులాగే శనివారం రాత్రి పదిన్నర గంటల సమయంలో విధులు ముగించుకొని ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్ర గాయాలైన షియా శరన్ రాయ్ (37) సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Advertisement
Next Story