రేబిస్ వ్యాధితో వ్యక్తి మృతి

by Shiva |
రేబిస్ వ్యాధితో వ్యక్తి మృతి
X

దిశ, చేగుంట : ఓ వ్యక్తి రేబిస్ వ్యాధి సోకి వ్యక్తి మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా చేగుంట మండల పరిధిలోని అనంతసాగర్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బీహార్ రాష్ట్రానికి చెందిన రితీష్ కుమార్(40) 20 సంవత్సరాల క్రితం చేగుంట మండలంలో పరిశ్రమలో పని చేయడానికి వచ్చి ఇక్కడే స్థిరపడ్డాడు. ఇదే ప్రాంతానికి చెందిన భవాని అనే యువతిని పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు.

ఆరు నెలల క్రితం రితీష్ కుమార్ ను కుక్క కరిచింది. టీకాల భయంతో ఇంజక్షన్ వేయించుకోవడానికి భయపడ్డాడు. దీంతో గత రెండు మూడు రోజులుగా అనారోగ్యం పాలైన రితీష్ కుమార్ ను తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి గాంధీ ఆసుపత్రిలోని వైద్యులు పరీక్షలు నిర్వహించగా రేబిస్ వ్యాధి సోకిందని వైద్యులు వెల్లడించారు. ఈ క్రమంలో అతను చికిత్స ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నితీష్ కుమార్ ఆదివారము ఉదయం మృతి చెందాడు.

Advertisement

Next Story