- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఘోరం.. పబ్లిక్ పార్క్‌లో వీధి కుక్కపై అత్యాచారానికి పాల్పడ్డ కామాంధుడు (వీడియో)
దిశ, వెబ్ డెస్క్: సమాజంలో శాడిస్టులు పెరిగిపోయారు. మానవత్వం మరిచి నీచంగా ప్రవర్తిస్తున్నారు. చిన్నా పెద్ద, ముసలి ముతకా అన్న తేడా లేకుండా దారుణాలకు ఒడిగడుతున్నారు. అసలు అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయింది. చివరికి కొంత మంది కామాంధులు మూగ జీవాలను కూడా వదలడం లేదు. ఇలాంటి ఘటనలు వార్తల్లో చూస్తూనే ఉన్నాం. తాజాగా మహారాష్టలోని పబ్లిక్ పార్క్‌లో ఓ కామాంధుడు వీధి కుక్కపై అత్యాచారానికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్టలోని నాగ్‌పూర్‌లో సాహునగర్‌లో ఓ 40 ఏళ్ల వ్యక్తి భవన నిర్మాణ పనులు చేసుకుంటూ నివాసం ఉంటున్నాడు. అయితే అదే ప్రాంతంలో ఓ వీధి కుక్క కూడా ఉంది. అది గమనించిన ఆ వ్యక్తి కుక్కతో కామ కోరికలు తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ప్రతిరోజూ దానికి అన్నం, బ్రెడ్, బిస్కెట్లు పెడుతూ మచ్చిక చేసుకున్నాడు. అదే ప్రాంతంలో ఓ పార్క్ ఉంది. పొద్దున సాయంత్రం వాకింగ్ చేయడానికి చాలా మంది వస్తారు. కానీ, మధ్యాహ్నం ఎవరూ లేని సమయం చూసుకుని కుక్కను పార్క్‌కు తీసుకెళ్లాడు. ఆ పార్క్ పక్కననే రోడ్డుపై చాలా మంది వెళ్తున్నారు. దాన్ని పట్టించుకోకుండా కుక్కపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అదే సమయంలో పార్క్‌లో ఉన్న ఓ వ్యక్తి ఈ దారుణ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు శుక్రవారం ఉదయం అతన్ని పట్టుకున్నారు. అతను మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాకు చెందినవాడిగా గుర్తించారు. అతనిపై సెక్షన్ 377, 294 జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం, ఇతర నేరాల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు.