ఒకే గదిలో ప్రేమ జంట ఆత్మహత్య..

by Kalyani |   ( Updated:2023-05-15 17:22:35.0  )
ఒకే గదిలో ప్రేమ జంట ఆత్మహత్య..
X

దిశ, కూకట్​పల్లి: గోదావరి జిల్లా భీమవరంకు చెందిన ప్రేమికులు ఇద్దరు ఒకే గదిలో ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కేపీహెచ్​బీ పోలీస్​ స్టేషన్ పరిధి​లోని కేపీహెచ్​బీకాలనీ 7వ ఫేజ్​లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రం వెస్ట్​ గోదావరి భీమవరంకు చెందిన ఆకుల శ్యామ్​(24), పోతుల జ్యోతి(22)లు కేపీహెచ్​బీకాలనీ 7వ ఫేజ్​లోని ఎల్​ఐజీ 8లోని ఇంట్లో నివాసం ఉంటున్నారు. సోమవారం గదిలో పోతుల జ్యోతి విషయం సేవించి ఆత్మహత్యకు పాల్పడగా ఆకుల శ్యామ్ ఫ్యాన్​కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

గదిలో నుంచి వాసన వస్తుండటాన్ని గమనించిన స్థానికులు కేపీహెచ్​బీ పోలీసులకు సమాచారం అందించారు. సంఘట స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి చూడగా ఇద్దరు మృతి చెంది ఉన్నారు. ఇద్దరు గత కొంత కాలంగా ఇంట్లో నివాసం ఉంటున్నట్టు స్థానికులు తెలిపారు. కాగా ఇద్దరు ఒకే ఊరుకు చెందిన వారు, దగ్గరి బంధువులుగా పోలీసుల విచారణలో తెలిసింది. కాగా జ్యోతి గతంలోనే భర్త నుంచి విడాకులు తీసుకుంది. శ్యామ్​కు వివాహం కాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలు ఇంక తెలియరాలేవని తెలిపారు.

Advertisement

Next Story