- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్రాక్టర్ హార్వెస్టర్ ను ఢీకొన్న లారీ.. పలువురికి గాయాలు..
దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మండలం చేపూరు గ్రామంలోని 63వ నెంబర్ జాతీయ రహదారి పై ట్రాక్టర్ పై ఆగి ఉన్న హార్వెస్టర్ ను వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొంది. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి కరీంనగర్ నుంచి అతివేగంగా వస్తున్న లారీ చేపూర్ శివారులోని సాయిబాబా మందిరం వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్ హార్వెస్టర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో హార్వెస్టర్ డ్రైవర్లు జీత్ బసర్, విశాల్, హార్వెస్టర్ యజమాని గంగారం, లారీ డ్రైవర్ ఫిరోజ్ లు గాయపడ్డారు.
రోడ్డు ప్రమాదంతో జాతీయ రహదారి పై ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. రోడ్డు ప్రమాద సమాచారం తెలుసుకున్న ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్ సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకొని రోడ్డు ప్రమాదంలో గాయపడ్డవారిని ఆర్మూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి వారిని మరింత మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదం వల్ల జాతీయ రహదారి పై స్తంభించిన ట్రాఫిక్ ను ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ క్లియర్ చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్ తెలిపారు.