- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నుంచి రూ.5 లక్షలు నొక్కేసిన కేటుగాళ్లు
దిశ, బ్యూరో కరీంనగర్: బీఆర్ఎస్ పార్టీ నేతలు చేపట్టిన దీక్షా దివస్ రోజు ఓ దొంగ వారి డబ్బులను తస్కరించి ఝలక్ ఇచ్చాడు. వెయ్యో రెండు వేలో కాదు.. ఏకంగా ఐదు లక్షల రూపాయలు దొంగలించి బీఆర్ఎస్ నేతలకు టోకరా ఇవ్వడం జిల్లాలో హట్ టాఫిక్‌గా మారింది. విశ్వాసనీయ సమాచారం ప్రకారం.. దీక్ష దివస్ కార్యక్రమానికి జన సమీకరణ చేయాలని పార్టీ అధిష్టానం నియోజకవర్గానికి రూ.10 లక్షలు కేటాయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేకు జన సమీకరణ చేయాలని పార్టీ ఫండ్ ఇచ్చారు. సదరు ఎమ్మెల్యే నగరంలోని ఓ స్టార్ హోటల్‌లో రూం (నంబర్209) అద్దెకు తీసుకుని అక్కడి నుంచి జనానికి డబ్బులు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది.
అయితే దీక్షా దివస్ అనంతరం ఆ మాజీ ఎమ్మెల్యే తన అనుచరులతో కలసి విందు చేసుకున్నారు. అనంతరం అక్కడినుంచి అందరు వెళ్లిపోగానే డబ్బులు లెక్క చూస్తే రూ.ఐదు లక్షలు తేడా వచ్చింది. ఖంగుతిన్న మాజీ ఎమ్మెల్యే తాను ఫిర్యాదు చేస్తే అధిష్టానం వద్ద పరువు పోతుందని తన అనుచరుడితో కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయించినట్టు సమాచారం. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు క్రైం నంబర్407/2024 సెక్షన్ 332(c),305 బీఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ విషయం ఉమ్మడి కరీంనగర్ జిల్లా సోషల్ మీడియా గ్రూపుల్లో తెగ వైరల్ అవుతోంది.