Ponguleti: మాజీ ఎమ్మెల్యే కుటుంబానికి మంత్రి పొంగులేటి పరామర్శ

by Ramesh Goud |
Ponguleti: మాజీ ఎమ్మెల్యే కుటుంబానికి మంత్రి పొంగులేటి పరామర్శ
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల అనారోగ్యంతో మరణించిన మాజీ ఎమ్యెల్యే ఊకే అబ్బయ్య(Former MLA UK Abbaiah) కుటుంబాన్ని రెవెన్యూ శాఖమంత్రి(Revenue Minister) పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) పరామర్శించారు. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాకు శ్రీకారం చుట్టారు. అలాగే ఇల్లందు(Illandu) మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య ఇంటిని సందర్శించి.. ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. అబ్బయ్య మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా.. అబ్బయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కాగా ఇల్లందు మాజీ ఎమ్మెల్యేగా పని చేసిన ఊకే అబ్బయ్య అనారోగ్యంతో హైదరాబాద్ లో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed