Moon : చంద్రుడిపై భూమి కన్నా వేగంగా టైం.. తాజా అధ్యయనంలో వెల్లడి

by Sathputhe Rajesh |   ( Updated:2024-12-02 10:47:17.0  )
Moon : చంద్రుడిపై భూమి కన్నా వేగంగా టైం.. తాజా అధ్యయనంలో వెల్లడి
X

దిశ, నేషనల్ బ్యూరో : భూమి కన్నా వేగంగా చంద్రుడిపై సమయం కదులుతున్నట్లు ‘అస్టార్నమికల్ జర్నల్’ అనే సంస్థ తన తాజా అధ్యయనంలో వెల్లడించింది. అల్బర్ట్ ఐన్‌స్టీన్ ‘జనరల్ రిలేటివెటీ థియరీ’ ఆధారంగా స్టడీ చేసినట్లు సంస్థ స్పష్టం చేసింది. చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి భూమి కంటే బలహీనంగా ఉండటంతో.. చంద్రుడిపై గడియారం ముళ్లు వేగంగా కదులుతున్నట్లు తెలిపింది. భూమితో పోలిస్తే చంద్రుడిపై గడియారం ముల్లు 56 మైక్రో సెకండ్లు, 0.000056 సెకండ్ల వ్యత్యాసంతో టిక్ అంటున్నట్లు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ మరియు టెక్నాలజీ శాస్త్రవేత్త బిజూనాథ్ పాట్లా తెలిపారు. ఐన్‌స్టీన్ సూత్రాలను ఉపయోగించి గతంలో చేసిన అధ్యయనాలను పాట్లా, ఆయన సహచరుడు అష్బిలు కలిసి తాజాగా మెరగు‌పర్చారు. ఫస్ట్ లూనార్ ల్యాండ్ అయిన 50 ఏళ్ల తర్వాత అర్టెమిస్ మిషన్‌లో భాగంగా నాసా ప్రస్తుతం మనుషులను చంద్రుడిపై పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో భూమి యొక్క సహజ ఉపగ్రహాన్ని అన్వేషించడానికి, రెండు గ్రహాల మధ్య కమ్యూనికేషన్ మరియు నావిగేషన్ వ్యవస్థల మధ్య ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఈ అధ్యయనం దోహదపడనుంది.

Advertisement

Next Story

Most Viewed