- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Parliament Session :పార్లమెంటుని కుదిపేస్తున్న అదానీ వ్యవహారం.. ఉభయసభలు వాయిదా
దిశ, నేషనల్ బ్యూరో: పార్లమెంటు శీతాకాల సమావేశాలను (Parliament Winter Session) అదానీ వ్యవహారం, సంభాల్ హింస కుదిపేస్తోంది. ఆ అంశాలపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టడంతో ఉభయ సభల కార్యక్రమాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. సోమవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. సమావేశాలు ప్రారంభమైన గంట వ్యవధిలోనే ఉభయసభలు మంగళవారనికి (డిసెంబర్ 3)కి వాయిదా పడ్డాయి. కాగా.. శుక్రవారం వాయిదా పడిన ఉభయసభలు తిరిగి సోమవారం ఉదయం 11 గంటలకు సమావేశమయ్యాయి. ఉభయ సభలు ప్రారంభం కాగానే సభలో అదానీ, సంభాల్‌లో జరిగిన హింసాకాండపై చర్చకు విపక్ష ఎంపీలు పట్టుబట్టారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో లోక్‌సభను(Lok Sabha) మధ్యాహ్నం 12 వరకూ వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఆ తర్వాత సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా నిరసనలు కొనసాగాయి. దీంతో సభను మంగళవారానికి వాయిదా వేశారు. రాజ్యసభలోనూ(Rajya Sabha) ఇదే పరిస్థితి కొనసాగింది. విపక్ష ఎంపీలు ఎంతకీ శాంతిచకపోవడంతో రాజ్యసభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ జగదీప్ ధంఖర్ ప్రకటించారు.