Metro Rail: హైదరాబాద్ మెట్రోలో లేడీ దొంగల హల్‌చల్

by Mahesh |   ( Updated:2022-10-22 16:54:41.0  )
Metro Rail: హైదరాబాద్ మెట్రోలో లేడీ దొంగల హల్‌చల్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మెట్రోలో లేడీ దొంగలు తమ చేతివాటం చూపిస్తున్నారు. దీపావళి పండుగ కావడంతో మెట్రోలో జనం కుప్పలు తెప్పలుగా ప్రయాణిస్తున్నారు. పండుగ సీజన్ ను అదునుగా చేసుకున్న లేడీ దొంగలు రద్దీగా ఉండే లేడిస్ కంపార్ట్‌మెంట్‌లో తమ చేతివాటం చూపిస్తున్నారు. ముఖ్యంగా సాయంత్ర సమయంలో రద్దిగా ఉండే ట్రైన్‌లనే టార్గెట్‌గా చేసుకుని లేడి కేడీలు తమ పని కానిచ్చేస్తున్నారు. దీంతో గత రెండు రోజుల్లో పదుల సంఖ్యలో చోరీలు జరిగినట్లు సమాచారం అందుతుంది.

ఈ విషయంపై బాధితులు మెట్రో సిబ్బందికి ఫిర్యాదు చేశారు. అయితే సిబ్బంది మాత్రం తమకు ఎటువంటి సంబంధం లేదని ట్రైన్ లోపల సీసీ కెమెరాలు ఉండవని ఒక సారీ ట్రైన్ ఎక్కాక ఎవరి వస్తులకు వారే భాద్యులని చెప్పడంతో బాధితులు తమ పొరపాటు వలన చోరి జరిగిందనుకోని పోలీసులకు చెప్పడం లేదు. దీంతో లేడీ దొంగలు తమ పనిని సాఫిగా చేసుకుంటున్నారు. ఇకనైన మెట్రో అధికారులు స్పంధించి దొంగతనాలు జరగకుండా చూడాలని.. అలాగే.. మహిళా కానిస్టేబుళ్లను మెట్రోలో డ్యూటిలో ఉంచి దొంగతనాలను అరికట్టవలసిందిగా ప్రయాణికులు కోరుతున్నారు.

Advertisement

Next Story