రైలుకింద పడి కూలి బలవన్మరణం

by Shiva |
రైలుకింద పడి కూలి బలవన్మరణం
X

దిశ, బెల్లంపల్లి : అనారోగ్యంతో తాగుడుకు బానిసై ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం బెల్లంపల్లి పట్టణంలో చోటుచేసుకుంది. జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం.. కాసిపేట మండలం దేవపూర్ కు చెందిన వేల్పుల రాజేశం (47) ఆదివారం రాత్రి 12 గంటల ప్రాంతంలో సోమగూడెం సమీపంలో మంచిర్యాల నుంచి బలార్ష వైపుకు వెళ్లే గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో రాజేశం తలచిధ్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. దేవపూర్ సిమెంట్ కంపెనీలో రాజేశం కాంట్రాక్ట్ కార్మికుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story