- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కిలాడీ లవర్స్.. ఆమె కంట్లో కారం కొట్టి ఏం చేశారో తెలుసా..
దిశ, మేడిపల్లి: ఓ ప్రేమ జంట జన సంచారం తక్కువగా ఉన్న ప్రాంతంలో చాయ్ డబ్బా నిర్వహిస్తున్న మహిళ కంటిలో కారం కొట్టి మెడలో నుంచి రెండు తులాల బంగారు గొలుసు దొంగలించిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మల్కాజగిరి డీసిపీ తెలిపిన వివరాలు ప్రకారం.. ఈ నెల 5వ తేదీన మేడిపల్లి మండలం పీర్జాదిగూడ సీపీఆర్ రోడ్డు జనసంచారం లేని ప్రాంతంలో టీ షాప్ నిర్వహిస్తున్న మహిళ వద్దకు యాక్టివా పై ఇద్దరు ప్రేమికులు వచ్చి టీ తాగి వెళ్లారు.
తర్వాత సదరు యువకుడు యువతిని వేరే దగ్గర ఉంచి మరల వచ్చి సిగరెట్ అడగగా సిగరెట్ ఇచ్చే సమయంలో మహిళా కంటిలో కారం కొట్టి, ఆమె మెడలో ఉన్న సుమారు రెండు తులాల బంగారం చైన్ లాక్కొని వెళ్లిపోయాడు. సంఘటన జరిగిన గంట తర్వాత బాధిత మహిళా మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు డీసీపీ, ఏసీపీ, సీఐ, డీఐ లు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. సీసీ ఫుటేజీలు పరిశీలించిన పోలీసులు బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం నిందితులను గుర్తించి 24 గంటల్లోపే అదుపులోకి తీసుకున్నారు.
నిందితులు జోగులాంబ గద్వాలకు చెందిన గొల్ల నరేష్(25), శ్రీరామ బాయ్స్ హాస్టల్ ఉప్పల్ లో ఉంటూ మెడికల్ రిప్రజెంటివ్ గా పనిచేస్తున్నాడు, రామంతపూర్ కు చెందిన వై. శిరీష(25), ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంది, నిందితులు ఇద్దరు కలిసి జల్సాలకు అలవాటు పడి అడ్డదారిలో డబ్బు సంపాదించాలని ఈ నేరానికి పాల్పడ్డారు. నేరానికి పాల్పడిన యాక్టీవా నెంబర్ ప్లేట్ తెలియకూడదనే నెంబర్ ప్లేట్ ను ఫోల్డ్ చేశాడు.
నెంబర్ ప్లేట్ లేకుండా గాని, నెంబరు ప్లేట్ కనబడకుండా గాని వాహనాలు నడిపిన వారిపై చర్యలు తీసుకోబోనున్నామని, తనిఖీలు ముమ్మరం చేసి ఇటువంటి వారిని ఉపేక్షించేది లేదని, అలానే ప్రజలు ఊరికి వెళ్లే ముందు బయట డోర్లకు తాళాలు లోపల నుంచి వేసుకోవాలని, ఇంట్లో ఎవరూ లేరని అందరికీ తెలిసేటట్లు చేయవద్దని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీసీపీ జానకి తెలిపారు. చాకచక్యంగా 24 గంటల్లోపు పట్టుకున్న సిబ్బందిని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి డీసీపీ జానకి, ఏసీపీ నరేష్ రెడ్డి, సీఐ గోవర్ధనగిరి, డీఐ ప్రవీణ్ బాబు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.