మెట్ పల్లిలో మైనర్ బాలిక కిడ్నాప్

by Shiva |
మెట్ పల్లిలో మైనర్ బాలిక కిడ్నాప్
X

గంటల వ్యవధిలోనే ఛేదించిన పోలీసులు

దిశ, మెట్ పల్లి : పట్టణంలోని మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన వ్యక్తిని పోలీసులు కొన్ని గంటల వ్యవధిలోనే పట్టుకున్న ఘటన పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పట్టణానికి చెందిన ఓ మైనర్ బాలికను మేడిపల్లి కి చెందిన వంశి అనే నిందితుడు తెల్లవారుజామున బాలికను కిడ్నాప్ చేశాడు. అప్రమత్తమైన బాలిక తల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి చాకచక్యంగా నిందితుడు వంశీని పట్టుకొని బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. అదేవిధంగా నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని ఎస్సై శ్యామ్ రాజ్ తెలిపారు.

Advertisement

Next Story