- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Jani Master : జానీ మాస్టర్ కస్టడీపై కీలక తీర్పు
దిశ, గండిపేట్ : ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయనను నాలుగు రోజుల పాటు పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ మేరకు జానీ మాస్టర్ కస్టడీ కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ అనంతరం న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. నాలుగు రోజుల కస్టడీకి అనుమతి ఇస్తున్నట్టు స్పష్టం చేసింది. బుధవారం నుంచి శనివారం వరకు కస్టడీకి రంగారెడ్డి కోర్టు అనుమతించింది.
పొక్సో కేసుపై నార్సింగ్ పోలీసులు విచారణ జరపనున్నారు. జానీ మాస్టర్‌ను కస్టడీలోకి తీసుకునేందుకు నార్సింగ్ పోలీసులు చంచల్ గూడ జైలుకి వెళ్లారు. కాగా ఇప్పటికే బాధితురాలి నుంచి పోలీసులు పలు ఆధారాలను సేకరించారు. వీటిని జానీ ముందు పెట్టి ఆయనను పోలీసులు ప్రశ్నించనున్నారు. కాగా జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. కాగా పోలీసు విచారణలో జానీ మాస్టర్ ఏమి చెప్పబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
- Tags
- Johnny Master