ఐదేళ్ల బాలికపై కామాంధుడి అఘాయిత్యం

by Shiva |
ఐదేళ్ల బాలికపై కామాంధుడి అఘాయిత్యం
X

నిందితుడిని అదుపులోకి తీసుకున్న బోధన్ పోలీసులు

దిశ, నిజామాబాద్ క్రైం : ఐదేళ్ల బాలికకు బొమ్మలు ఇస్తానని ఆశచూపి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఓ వీధిలో ఖాజమియా అనే వ్యక్తి పిల్లలు ఆడుకునే బొమ్మలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదే వీధిలో ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారికి బొమ్మలు ఇస్తానని ఆశ చూపి చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలుపడంతో వారు బోధన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని కామాంధుడు ఖాజమీయాను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Advertisement

Next Story