ఎండ వేడికి జేసీబీ దగ్ధం..

by Sumithra |
ఎండ వేడికి జేసీబీ దగ్ధం..
X

దిశ, రుద్రంగి : ఎండవేడికి జేసీబీ వాహనం దగ్ధం అయిన సంఘటన రుద్రంగి మండలంలో బుధవారం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకెళితే రుద్రంగి మండలం మనాల నుండి మారిమడ్ల వరకు రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. కాగా బుధవారం రుద్రంగిలో ఎండ తీవ్రత 42 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండడంతో మానాల మరిమడ్ల రోడ్డు పనులు చేస్తున్న హిటచి జేసీబీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.

ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై ప్రభాకర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దెగవత్ తిరుపతి, మాజీ వైస్ ఎంపీపీ బాధనవేని రాజారామ్, సంఘటన స్థలానికి చేరుకొని గ్రామ పంచాయితీ వాటర్ ట్యాంకర్ తో మంటలను అర్పివేశారు. అయినప్పటికీ జేసీబీ వాహనం పూర్తిగా కలిపోయాంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు వాహనాల పట్ల జాగ్రత్త వహించాలని ఎస్సై ప్రభాకర్ కోరారు.

Advertisement

Next Story

Most Viewed