ముగిసిన కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల విచారణ

by Sridhar Babu |   ( Updated:2024-10-30 14:43:29.0  )
ముగిసిన కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల విచారణ
X

దిశ, శంకర్పల్లి : కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల (Raj Pakala)ఫామ్ హౌస్ కేసు విచారణ నాలుగు గంటల పాటు కొనసాగింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మండలం జన్వాడ గ్రామ పరిధిలోని రంగారావు ఫామ్​ హౌస్ శ్రీమతే ప్రాపర్టీస్ లో జరిగిన సంఘటనపై కేసు విచారణ ముగిసింది. హైకోర్టు ఆదేశాల మేరకు కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల బుధవారం మోకిలా పోలీస్ స్టేషన్ (Mokila Police Station)కు వచ్చారు. నాలుగు గంటల పాటు విచారణ నిర్వహించారు. విదేశీ మద్యం, విజయ్ మద్దూరికి డ్రగ్స్ ఎలా వచ్చాయి అనే అంశాలపై విచారణ జరిపినట్లు సమాచారం. మోకిలా పోలీస్ స్టేషన్లో విచారణ జరిపిన అనంతరం తిరిగి ఫామ్ హౌస్ కు తీసుకెళ్లారు.

అక్కడి నుంచి మళ్లీ పోలీస్ స్టేషన్​కు తీసుకువచ్చారు. నాలుగు గంటల పాటు జరిగిన విచారణ ముగిసింది. పోలీసుల విచారణలో రాజ్ పాకాల అనుమతి లేకుండా విదేశీ మద్యాన్ని పార్టీలో వినియోగించడం, డ్రగ్స్ కలకలం తదితర అంశాలపై పోలీసులకు బలమైన సాక్ష్యాలు లభించాయా? లేదా? సాక్ష్యాలు లభిస్తే రాజ్ పాకాలను అరెస్టు చేస్తారా, కోర్టులో రిమాండ్ పరుస్తారా? అనేది పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. రాజ్ పాకాలను మీడియా ముందుకు రాకుండా పోలీసులు గోప్యంగా విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story