- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పిడుగుపాటుకు ఆరు గేదెలు మృతి
by Javid Pasha |
X
దిశ, కడప: పిడుగుపాటుకు గురై ఆరు పాడి గేదెలు మృత్యువాత పడ్డ ఘటన వైఎస్ఆర్ కడప జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని వేముల మండలం బెస్తవారిపల్లె గ్రామంలోని గాండ్లపెంట బాబు అనే రైతుకు తొమ్మిది పాడి గేదెలు ఉన్నాయి. మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులు రావడంతో రైతు ఆ పాడి గేదెలను ఊరి చివరన ఉన్న వేప చెట్టుకింద కట్టేశాడు. అయితే ఆ చెట్టుపై పిడుగు పడటంతో ఆరు గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఇక మిగతా మూడు గేదెలు ప్రాణాలతో బయటపడ్డాయి. జీవానాధారమైన పాడి గేదెలు మృతి చెందడంతో రైతు కన్నీరుమున్నీరు అవుతున్నాడు. గేదెల మృతితో మూడు లక్షల రూపాయలకు పైగా నష్టం వచ్చిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాబు కుటుంబ సభ్యలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Advertisement
Next Story