- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Scam Alert:ఫేక్ జాబ్ నోటిఫికేషన్‌తో స్కామర్ల కొత్త మోసం.. గుర్తించకపోతే అంతే సంగతి!

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో ఉద్యోగం కోసం యువత పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. డిగ్రీలు, పీజీలు పూర్తి చేసిన అనంతరం ఉద్యోగం సాధించాలనే తపనతో చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ప్రణాళికలు వేసుకుని అందుకు తగ్గట్టుగా ప్రిపరేషన్ ప్రారంభిస్తారు. మరికొందరైతే ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థిరపడాలనే ఉద్దేశ్యంతో ఉంటారు. ఈ క్రమంలో ఎక్కడ ఏ కంపెనీ జాబ్ ఆఫర్ ప్రకటిస్తుందో అని ఎదురు చూస్తారు. ఇటీవల కాలంలో టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందో గమనిస్తూనే ఉన్నాం. సైబర్ మోసాలతో ఎంతో మంది బలవుతున్నారు. ఇదిలా ఉంటే.. ఉద్యోగ వేటలో ఉన్న వారిని సైబర్ నేరగాళ్లు నిండా ముంచుతున్నారు. లింక్డ్‌ఇన్‌లో ఫేక్ జాబ్ నోటిఫికేషన్లను స్కామర్లు పోస్ట్ చేస్తున్నట్లు సైబర్ నిపుణులు గుర్తించారు.
అసలు విషయమేంటంటే.. ఈ గ్రూప్ LinkedIn, WellFound & CryptoJobsList ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లలో నకిలీ ఉద్యోగ జాబితాలను పోస్ట్ చేయడం జరుగుతుందన్నారు. "ChainSeeker.io" అనే నకిలీ కంపెనీ ముసుగులో పనిచేస్తున్న సైబర్ నేరస్థులు ట్విట్టర్ మరియు LinkedIn వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ప్రొఫెషనల్ వెబ్‌సైట్, సోషల్ మీడియా ప్రొఫైల్‌లతో పూర్తి స్థాయిలో ఆన్‌లైన్ ఉనికిని సృష్టించారు. ఈ నేపథ్యంలో ‘‘జాబ్ అప్లై చేసిన వారికి స్కామర్లు కాల్ చేసి ‘Grass Call’ అనే వీడియో కాల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయిస్తున్నారు. దీని ద్వారా సదరు వ్యక్తి ఫోన్, కంప్యూటర్‌లోని డేటా, బ్యాంక్ వివరాలతో సహా ప్రైవసీ సమాచారన్ని సేకరిస్తున్నారు’’ అని సైబర్ నిపుణులు తెలిపారు. అయితే.. గ్రాస్‌కాల్ యాప్ హానికరమైనది. ఫోన్ లేదా కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, సైబర్ నేరస్థులు మరియు స్కామర్‌లు పరికరంలో నిల్వ చేసిన వివరాలను దొంగిలించడానికి ఈ యాప్‌ను ఉపయోగించేవారని సమాచారం.