- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లోన్లు ఇప్పిస్తమంటూ జనానికి కుచ్చుటోపీ.. ఎట్టకేలకు అరెస్ట్
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: లోన్లు ఇప్పిస్తామంటూ నమ్మించి అయిదు కోట్ల రూపాయలకు పైగా కొల్లగొట్టిన గ్యాంగ్‌ను హైదరాబాద్ నేరపరిశోధక విభాగం సైబర్‌క్రైం పోలీసులు శుక్రవారం ఢిల్లీలో అరెస్టు చేశారు. నిందితుల నుంచి పదిహేడు మొబైల్ఫోన్లు, ఏడు ల్యాప్‌టాప్‌లు, ఒక కంప్యూటర్ను స్వాధీనం చేసుకున్నారు. సైబర్ క్రైమ్స్డీసీపీ స్నేహా మెహ్రా మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
సీనియర్ సిటిజన్ ఫిర్యాదుతో..
హైదరాబాద్‌కు చెందిన ఓ సీనియర్సిటిజన్ఇల్లు కట్టుకోవటానికిగాను రుణం తీసుకోవాలని నిర్ణయించుకుని కొంతకాలం క్రితం గూగుల్‌లో లోన్ కంపెనీల కోసం సెర్చ్చేశాడు. ఈ క్రమంలో అతనికి రిలయన్స్ఫైనాన్స్కంపెనీ ప్రతినిధిని అంటూ అభినవ్అనే వ్యక్తి కాల్చేశాడు. లోన్ ప్రాసెస్చేయటానికి ఎలాంటి రుసుము ఉండదని చెప్పిన సదరు అభినవ్ ఆ తరువాత రిజిస్ర్టేషన్ఫీజు, ప్రాసెసింగ్‌ఫీజు, కాంటింజెన్సీ డెవలప్మెంట్ఛార్జీలు, జీఎస్టీ, ఆదాయం పన్ను అంటూ సదరు సీనియర్సిటిజన్ నుంచి విడతలవారీగా 30లక్షల రూపాయలను ఫోన్‌పే, గూగుల్‌పే యాప్‌ల నుంచి తాను చెప్పిన అకౌంట్లకు బదిలీ చేయించుకున్నాడు. ఆ తరువాత మెయిల్ద్వారా లోన్అప్రూవల్లెటర్లు కూడా పంపించాడు. అయితే, అవి నకిలీవని తేలటంతో సదరు సీనియర్సిటిజన్సైబర్క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు ఐటీ యాక్ట్సెక్షన్66సీ, ఐపీసీ 420, 419 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసి ఇన్స్పెక్టర్హరిభూషణ్రావు, ఎస్ఐలు సురేశ్, శైలేందర్‌కుమార్, కానిస్టేబుళ్లు రవిశంకర్, రాము, మనీష్‌కుమార్ తివారి, సాయికుమార్ప్రత్యేక బృందంగా ఏర్పడి ఏసీపీ వీ.ఎం.ప్రసాద్‌పర్యవేక్షణలో విచారణ ప్రారంభించారు.
ఢిల్లీ కేంద్రంగా..
దర్యాప్తులో ఈ మోసానికి పాల్పడ్డ ముఠా ఢిల్లీ కేంద్రంగా నేరాలు చేస్తున్నట్టు నిర్ధారించుకున్న సైబర్‌క్రైం పోలీసుల బృందం అక్కడికి వెళ్లింది. హర్యానా రాష్ర్టం ఫరీదాబాద్‌కు చెందిన తరుణ్ఓఝా (31) మ్యాజిక్ట్రిప్ఇండియా పేర సంస్థను ప్రారంభించి మోసాలు చేస్తున్నట్టు తెలుసుకుని అతన్ని అరెస్టు చేసింది. అతనితోపాటు సంస్థలో భాగస్వామిగా ఉన్న గురుచరణ్‌సింగ్(26), మేనేజర్‌గా పనిచేస్తున్న యోగేంద్రసింగ్బదోరియా (29), టీం లీడర్‌గా ఉద్యోగం చేస్తున్న షహదత్అన్సారీ (25)లను కూడా అదుపులోకి తీసుకుంది.
మోసాలు ఇలా..
ప్రముఖ లోన్కంపెనీలైన రిలయన్స్క్యాపిటల్ఫైనాన్స్తదితర సంస్థలకు తాము ప్రతినిధులమని చెప్పుకొంటూ నిందితులు రుణాలు ఇప్పిస్తామంటూ ఫోన్‌కాల్స్ చేయటంతోపాటు వాట్సాప్మెసేజీలు, మెసేజీలు, ఈ మెయిళ్లను తాము నడుపుతున్న కాల్సెంటర్నుంచి బల్క్‌గా పంపించేవారు. వీటికి ఎవరనా స్పందిస్తే వారిని నమ్మించి ఉచ్ఛులోకి లాగేవారు. ముందుగా ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని ఆ తరువాత రకరకాల పేర్లతో డబ్బు గుంజేవారు. ఈ విధంగా దేశవ్యాప్తంగా ఇరవై ఏడు మందిని మోసం చేసి అయిదు కోట్ల రూపాయలకు పైగా కొల్లగొట్టారు. ఇక, ఈ కేసులో మ్యాజిక్ట్రిప్కంపెనీ ఉద్యోగులైన నవీన్‌కుమార్(24), ప్రేంవీర్సింగ్(30), టెలీకాలర్లుగా పనిచేస్తున్న జ్యోతికుమారి (20), జాన్వీ తివారి (21), కంచన్(23)లకు కూడా పాత్ర ఉన్నట్టు నిర్ధారించుకున్న ప్రత్యేక బృందం వీరిని విచారించటానికి 41(ఏ) సెక్షన్‌ప్రకారం నోటీసులు జారీ చేసింది. వీరిని త్వరలోనే విచారించనున్నట్టు డీసీపీ స్నేహా మెహ్రా తెలిపారు.