ప్రమోషన్ కోసం బాస్‌కు గిఫ్ట్‌గా భార్య..? మరిది కూడా తక్కువోడేం కాదు..!

by Nagaya |   ( Updated:2023-03-02 15:19:54.0  )
ప్రమోషన్ కోసం బాస్‌కు గిఫ్ట్‌గా భార్య..? మరిది కూడా తక్కువోడేం కాదు..!
X

దిశ, వెబ్‌డెస్క్: భార్య అంటే భర్తలో సగం. భర్త కష్టసుఖాల్లో ఆమె పాలుపంచుకుంటుంది. పతి కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడుతుంది. కనిపించే దేవుడిగా భావిస్తూ.. పతిదేవుడు అంటూ కొలుస్తారు భార్యలు. కానీ కొంత మంది భర్తలు ఆ పదానికే మచ్చ తెస్తున్నారు. భార్యను ఆట వస్తువుగా చూస్తున్నారు. తన చేతిలో కీలుబొమ్మగా మార్చుకోని వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. తాజాగా ఓ భర్త భార్యను అంగడి సరుకుగా మార్చాడు. తన స్వప్రయోజనం కోసం కామాన్ని తీర్చే వస్తువుగా మార్చాడు. బాస్‌కు భార్యను ఎరగా వేసేందుకు ప్రయత్నించి కటకటలాపాలయ్యాడు. మధ్య ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

పూణేకు చెందిన అమిత్ ఛబ్రాకు కొన్నాళ్ల క్రితం ఇండోర్‌కు చెందిన యువతితో వివాహం అయింది. పెళ్లై కొన్నాళ్లుగా సజావుగానే కాపురం చేసిన అమిత్ ఛబ్రా.. జులాయిలతో స్నేహం చేసి చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఈ క్రమంలో స్నేహితులతో భార్యలను మార్చుకునేందుకు (wife swapping ) ప్రయత్నించాడు. తన స్నేహితులతో శృంగారం చేయాలని.. వారి భార్యలు తనతో చేస్తారని ఆమెపై ఒత్తిడి చేశాడు. దీనికి భార్య ఒప్పుకోకపోవడంతో చితకబాదాడు. ఇదే సమయంలో ఆ ఇల్లాలు మరిది కూడా వదినపై కన్నేశాడు. తన కోరిక తీర్చాలని పట్టుబట్టాడు. ఈ విషయం అత్తారింటి వారికి చెప్పినా వాళ్లు పట్టించుకోలేదు. మరోవైపు తన ప్రమోషన్ కోసం నిన్ను గిఫ్ట్‌గా తనబాస్‌కు ఇస్తున్నానని, బాస్‌తో శృంగారంలో పాల్గొని తనను ఉన్నతస్థితిలో నిలబెట్టాలని వేధింపులకు పాల్పడ్డాడు. ఆమె దేనికీ ఒప్పకోకపోవడంతో భర్తతో కలిసి మరిది, అత్త దాడికి పాల్పడ్డారు. ఆపై మరిది లైంగిక దాడికి యత్నించాడు. దీంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది.

అయినా భర్త, మరిది లైంగిక వేధింపులు ఆగకపోవడంతో వాటిని తట్టుకోలేని ఆమె ఏడాది క్రితం ఇండోర్ వెళ్లి తన తల్లి దగ్గరే ఉంటుంది. కూతురు మళ్లీ భర్త దగ్గరకు పోవడానికి నిరాకరిస్తుండటంతో తల్లి గట్టిగా నిలదీసింది. దీంతో అత్తారింట్లో తను ఎదుర్కొన్న చేదు ఘటనలను వివరించి భోరున విలపించింది. దీంతో ఆమె కూతురుతో వెళ్లి ఇండోర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అమిత్ ఛబ్రాతోపాటు కుటుంబ సభ్యులను పిలిపించి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి భార్యను వాళ్లతో పంపించారు. కొద్ది రోజులు బాగానే ఉన్న అత్తింటి వారు మళ్లీ వేధింపులు ప్రారంభించడంతో యువతి తల్లిదండ్రులు ఇండోర్ కోర్టును ఆశ్రయించారు. స్పందించిన కోర్ట్ వెంటనే కేసు నమోదు చేయాలని, మహిళా సంక్షేమ అధికారిణితో సమగ్ర విచారణ జరిపించాలని పోలీసులను ఆదేశించింది. దీంతో భర్త, మరిది, అత్తపై పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉన్నది.

ఇవి కూడా చదవండి:

డాక్టర్‌పై కన్నేసిన నర్స్.. అత్యాచారం చేసి ఆపై న్యూడ్ ఫొటోలతో బెదిరిస్తూ..

Advertisement

Next Story