అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త..

by Sumithra |
అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త..
X

దిశ, నిజామాబాద్ క్రైం : అనుమానం పెనుభూతమై భార్యను భర్తహత్య చేసిన సంఘటన గురువారం ఆలస్యంగా వెలుగు చూసింది. నిజామాబాద్ నగరంలోని ఖానాపూర్ లో గెలాండే సవిత (38) ను ఆమె భర్త మారుతి గొంతు నులిమి హత్యచేశాడు. పిల్లలు స్కూల్ కు వెళ్ళిన తర్వాత భార్య గొంతుకు టీ షర్ట్ తో ఉరిబిగించి హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. భార్య ఇతరులతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిసింది. భార్యకు ఒక కన్నుకనిపించక పోయిన వివాహేతర సంబంధాలు అంటగట్టి నిత్యం గొడవపడేవారని స్థానికులు తెలిపారు.

భార్య కూలీపని, భర్త హమాలిపని చేసుకుని కుటుంబాన్ని పోశించుకుంటుండగా అనుమానంతో భార్యను హత్య చేశాడని బాధితురాలి తండ్రి బాబురావు ఫిర్యాదు చేశాడు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలూకాలోని సరకెల్లి గ్రామానికి చెందిన భార్య భర్తలు గత కొంతకాలంగా ఖానాపూర్ లో నివసిస్తున్నారు. వారికి ముగ్గురు ఆడపిల్లలు కాగా పెద్దకూతురుకు వివాహం చేయగా ఇద్దరు స్కూల్ చదువుతున్నట్టు తెలిసింది. ఈ మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్సై లింబాద్రి తెలిపారు. సంఘటన స్థలాన్ని నిజామాబాద్ రూరల్ సౌత్ సీఐ జగడం నరేష్ పరిశీలించారు.

Advertisement

Next Story

Most Viewed