నగరంలో దొంగల హల్..చల్

by Shiva |   ( Updated:2023-06-07 16:13:00.0  )
నగరంలో దొంగల హల్..చల్
X

దిశ, నిజామాబాద్ క్రైం : నగరంలోని 4వ టౌన్ పరిధిలోని ముసుగు దొంగలు హల్..చల్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై సందీప్ కథనం ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో పాంగ్రా శివారులో గల ప్రకాష్ హ్యూండాయ్, వరుణ్ మోటార్స్, టాటా మోటార్స్ షోరూంలలో దొంగలు ముసుగు ధరించి దొంగతనానికి పాల్పడ్డారు. వరుణ్, ప్రకాష్ హ్యూండాయ్ షోరూంలో లాకర్లు తెరుచుకోకపోవడంతో దొంగలు వెనుదిరిగారు. పక్కనే ఉన్న టాటా షోరూంలో దొంగలు సీసీ కెమెరాలు ధ్వంసం చేసి సుమారు రూ.లక్ష దొంగించినట్లు ఎస్సై తెలిపారు. ఈ దొంగల ముఠా మహారాష్ట్రాకి చెందిన వారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నలుగురు ముసుగు దొంగలు సెక్యూరిటీ గార్డులు ఉండగానే వెనుక నుంచి ప్రవేశించి చోరికి పాల్పడ్డారు. గతంలో ముసుగు దొంగలు చోరిలకు పాల్పడిన ఆ కేసులో పురోగతి లేదు. ఈ మేరకు కేసు నమోదు చేసి సీసీ టీవీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story