- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాకిస్తాన్‌లో భారీ బాంబ్ బ్లాస్ట్.. 12 మంది మంది పోలీసులు దుర్మరణం
దిశ, డైనమిక్ బ్యూరో: పాకిస్తాన్‌లో మరోసారి బాంబుల మోత మోగింది. స్వాత్‌లోని కౌంటర్ టెర్రరిజం డిపార్ట్ మెంట్ పోలీస్ స్టేషన్‌లో సంభవించిన వరుస పేలుళ్ల ఘటనలో సుమారు 12 మంది పోలీసులు మరణించగా 40 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనలో పోలీస్ స్టేషన్ భవనం ధ్వంసం అయినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం స్టేషన్‌లో రెండుసార్లు పేలుళ్లు సంభవించాయి. దీంతో ఇది ఉగ్రదాడే అనే ప్రచారం జరిగింది. అయితే ఇది ఆత్మాహుతి దాడి కాదని స్టేషన్‌లో మందుగుండు సామాగ్రి, మోర్టార్ షెల్స్ నిల్వ ఉంచిన ప్రదేశంలో పేలుడు జరిగినట్లు సీటీడీ డీఐడీ ఖలీద్ సోహైల్ స్పష్టం చేశారు.
పోలీస్ స్టేషన్‌పై ఎలాంటి దాడి గానీ, కాల్పులు గానీ జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు జరిపిస్తున్నామని, కూలిపోయిన భవనం పాతదేనని, చాలామంది సిబ్బంది కొత్త భవనంలో ఉన్నారని సీటీడీ డీఐజీ తెలిపారు. ఒక్కసారిగా సంభవించిన వరుస పేలుళ్లు స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. భవం కుప్పకూలడం వల్ల విద్యుత్ అంతరాయం ఏర్పడిందని అధికారులు వెల్లడించారు.