అయ్యో.. ఇదెక్కడి ఘోరం.. భార్యను అడవిలో వదిలి‌వెళ్లిన భర్త!

by Shiva |   ( Updated:2024-12-15 05:49:07.0  )
అయ్యో.. ఇదెక్కడి ఘోరం.. భార్యను అడవిలో వదిలి‌వెళ్లిన భర్త!
X

దిశ, ములుగు: కట్టుకున్న భార్యను భర్త అడవిలో వదిలివెళ్లిన ఘటన సిద్దిపేట జిల్లా ములుగు మండల పరిధిలోని వంటిమామిడి గ్రామ శివారు‌లో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు మహారాష్ట్రకు చెందిన విక్రమ్‌ మన్వర్‌ ఉద్యోగ రీత్య బెంగళూరులో నివాసం ఉంటున్నాడు. అక్కడ రబియా అనే యువతితో పరిచయం ఏర్పడటంతో ఆమెతో పాటే కలిసి ఉంటూ ఈ నెల 4న పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. హైదరాబాద్ వచ్చాక కూడా శనివారం మళ్లీ గొడవ జరగడంతో రబియా పెయిన్‌ కిల్లర్‌ మాత్రలు మింగేసింది. దీంతో విక్రమ్‌, భార్యను తీసుకొచ్చి ములుగు మండలంలోని వంటిమామిడి అడవిలో వదిలేశాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అదజేయడంతో వారు ఘటనా స్థలానికి చేరకుని రబియాను ఆర్వీఎం ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు యువతి తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు.

Advertisement

Next Story

Most Viewed