Minister Veeranjaneya Swami: జగన్ ప్రభుత్వంలో అన్ని వర్గాలు మోసపోయాయి.. మంత్రి వీరాంజనేయ స్వామి ఫైర్

by Shiva |   ( Updated:2024-12-15 08:49:59.0  )
Minister Veeranjaneya Swami: జగన్ ప్రభుత్వంలో అన్ని వర్గాలు మోసపోయాయి.. మంత్రి వీరాంజనేయ స్వామి ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: జగన్ ప్రభుత్వం (Jagan Government)లో అన్ని వర్గాలు మోసపోయాయని మంత్రి బాల వీరాంజేయ స్వామి (Minister Bala Veerajnaneya Swami) ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఆయన ఫైర్ అయ్యారు. విద్యుత్ చార్జీలు, నిత్యవసర వస్తువుల ధరల పెంపుతో సామన్య ప్రజలపై మోయలేని భారాన్ని మోపారని పైర్ ధ్వజమెత్తారు. మళ్లీ నేడు ఆ పార్టీ ప్రజా సమస్యలపై ధర్నాలు, నిరసనలు పిలుపునిస్తుందని ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో ధర్నాలు చేసే నైతిక హక్కు వైసీపీ (YCP) నాయకులకు లేదని అన్నారు. ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రైతులు, నిరుపేదల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కూటమి సర్కార్ అలుపెరుగకుండా పని చేస్తుందని మంత్రి బాల వీరాంజనేయ స్వామి అన్నారు.

Advertisement

Next Story