- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుడా చైర్మన్ ప్రమాణస్వీకారం కార్యక్రమం లో అపశృతి.. ఒక్కసారిగా కూలిపోయిన స్టేజ్
దిశ, వెబ్ డెస్క్: కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. ఒక్కసారిగా స్టేజి కూలిపోవడంతో అంతా భయబ్రాంతులకు గురవ్వగా స్టేజీ మీద ఉన్న కీలక నేతల ఆందోళనకు గురయ్యారు. అయితే ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడం అంతా ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే కాకినాడ కుడా(KUDA) చైర్మన్ గా ఈ రోజు తుమ్మల బాబు ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన స్టేజ్ పైకి పరిమితికి మించిన నాయకులు ఎక్కవడంతో స్టేజ్ ఒక్కసారిగా కూలిపోయింది. కాగా ప్రమాద సమయంలో స్టేజ్ పై ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే పంతం నానాజీ, రాజప్పలు ఉన్నారు. కాగా ఈ ప్రమాదంతో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గజమాల వేసేందుకు కార్యకర్తలు ఒక్కసారిగా స్టేజి మీదకు రావడం తో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికి టీడీపీ నేతలు పెను ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారని చెప్పుకొవాలి.