భారీగా బెల్లం పట్టివేత

by Sridhar Babu |
భారీగా బెల్లం పట్టివేత
X

దిశ, కాగజ్ నగర్ : వాహనంలో అక్రమంగా తరలిస్తున్న బెల్లంను సిర్పూర్ టి పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై కమలాకర్ తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్ర నుంచి వరంగల్ కు డీసీఎంలో 11 క్వింటాళ్ల బెల్లాన్ని తరలిస్తున్నట్లు నమ్మదగిన సమాచారంతో సిర్పూర్ టి మండలం వెంకట్రావు పేట గ్రామ సమీపంలో పట్టుకున్నట్లు తెలిపారు. దీనికి ఎలాంటి అనుమతులు లేవని పేర్కొన్నారు. మహారాష్ట్రకు చెందిన ఇద్దరిపై కేసు నమోదు చేసి వ్యాన్ సీజ్ చేసినట్లు తెలిపారు. బెల్లం విలువ సుమారు రూ.5.5 లక్షల వరకు ఉంటుందని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed