హెచ్‌సీయూ ఘటన : ప్రొఫెసర్‌ రవిరంజన్ సస్పెండ్

by Sathputhe Rajesh |   ( Updated:2022-12-03 15:45:33.0  )
హెచ్‌సీయూ ఘటన : ప్రొఫెసర్‌ రవిరంజన్ సస్పెండ్
X

దిశ, శేరిలింగంపల్లి: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ హెచ్‌సీయూ లైంగికదాడి యత్నం ఘటనలో ప్రొఫెసర్ రవిరంజన్ పై అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. థాయ్‌లాండ్‌కు చెందిన విద్యార్థినికి హిందీ నేర్పిస్తానని ప్రొఫెసర్ తన ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం యువతికి మద్యం తాగించి లైంగికదాడికి యత్నించాడు. యువతి ప్రతిఘటించడంతో హెచ్ సీయూ యూనివర్సిటీ గేటు వద్ద యువతిని కారులో దించి వెళ్లిపోయాడు. బాధిత యువతి గచ్చిబౌలికి వెళ్లగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హెచ్ సీయూ వర్గాలు ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నాయి. రవిరంజన్ పై ఎఫ్ఐఆర్ నమోదైన నేపథ్యంలో సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశాయి. ఈ సస్పెన్షన్ తక్షణమే అమలులోకి వస్తుందని యూనివర్సిటీ అధికార వర్గాలు తెలిపాయి.

Advertisement

Next Story