విషాదం.. ఆర్టీసీ బస్సు ఢీకొని తాత, మనవరాలు మృతి

by Mahesh |   ( Updated:2023-05-22 07:51:42.0  )
విషాదం.. ఆర్టీసీ బస్సు ఢీకొని తాత, మనవరాలు మృతి
X

దిశ, రేగొండ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం బాగిర్తిపేట క్రాస్ రోడ్డు వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తాత మనవరాలు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. ములుగు గణపురం మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన బుక్కయ్య తన చిన్న కుమార్తె కూతురు‌ను బైకుపై కోటంచకు తీసుకెళ్తుండగా భూపాలపల్లి నుంచి హనుమకొండ‌కు వస్తున్న ఆర్టీసీ బస్సు బాగిర్తిపేట వద్ద ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తాత, మనవరాలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.

Read More: శుక్రవారం మృతి.. ఆదివారం బయటపడ్డ మృతదేహం

Advertisement

Next Story