దారుణం : భార్యకు గర్భం పోకూడదని, పొరిగింటి బాలికను బలిచ్చిన భర్త

by samatah |
దారుణం : భార్యకు గర్భం పోకూడదని, పొరిగింటి బాలికను బలిచ్చిన భర్త
X

దిశ, వెబ్‌డెస్క్ : టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతూ వస్తున్నా కొందరు మాత్రం ఇంకా మూఢనమ్మకాల మాయలోనే ఉన్నారు. మూఢనమ్మకాల ఊబిలో చిక్కకోని అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. త పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.

బీహార్‌కు చెందిన అలోక్ కుమార్, కోల్‌కతాలోని టిల్జాలా ప్రాంతంలో నివసిస్తున్నాడు. అతడి భార్యకు మూడుసార్లు గర్భస్రావమైంది. ఆమె మళ్లీ గర్భం దాల్చింది. భార్యకు ఈసారి గర్భస్రావం కాకుండా ఉండేందుకు ఏం చేయాలో అర్థం కాక, ఓ మంత్రగాడిని కలిశాడు. అతను ఓ చిన్నారిని నర బలి ఇస్తే నీ భార్యం గర్భం నిలుస్తుందని చెప్పాడు. దీంతో తన భార్య గర్భం నిలవడం కోసం అలోక్ కుమార్, తన పొరిగింటిలో ఉన్న చిన్న పాపను నర బలి ఇచ్చాడు. బిల్డింగ్‌లో రక్తపు మడుగుల్లో ఉన్న బాలికను చూసి కుటుంబ సభ్యులు, షాక్ అయ్యారు, నరబలి పేరుతో చిన్నారిని దారుణంగా హత్య చేశారంటూ నిరసనకు దిగారు. ఇక ఈఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితున్ని అరెస్ట్ చేశారు.

Advertisement

Next Story