- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాచుపల్లిలో గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం
X
దిశ, కొడిమ్యాల : గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం సంభవించిన ఘటన కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన అక్కెపల్లి అనిల్ అనే వ్యక్తి ఇంట్లో సిలిండర్ లీకై మంటలంటుకుని ఇంట్లోని వస్తువులు ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమైంది. మధ్యాహ్నం సమయంలో సిలిండర్ లీక్ కావడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. కుటంబ సభ్యులు గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ ఇంజన్ వచ్చే లోపే మంటలను చుట్టుపక్కల వాళ్లు ఆర్పి వేశారు. కాగా, మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో ఇంట్లోని రిఫ్రిజిరేటర్, కంప్యూటర్, టీవీ, ఫర్నీచర్ ఇంట్లోని వస్తువులు దగ్ధమయ్యాయి. సుమారు రూ.3 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు ఫైర్ స్టాఫ్ అంచనా వేశారు. చుట్టుపక్కల వాళ్లు అప్రమత్తమై మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.
Advertisement
Next Story