- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లి వేడుకకు హాజరైన గ్యాంగ్‌స్టర్ హత్య
దిశ, డైనమిక్ బ్యూరో: భారతసంతికి చెందిన ఓ గ్యాంగ్‌స్టర్ కెనడాలో దారుణ హత్యకు గురయ్యాడు. కెనడాలో టాప్ 10 గ్యాంగ్‌స్టర్లలో ఒకడైన అమర్ ప్రీత్ సామ్ర అలియాస్ చిక్కీని అతడి ప్రత్యర్థి గ్యాంగ్ బ్రదర్స్ గ్రూప్ సభ్యులు దారుణంగా కాల్చి చంపారు. ఆదివారం వాంకోవర్ సిటీలో ఈ ఘటన జరిగింది. ఓ పెళ్లివేడుకలో అమర్ ప్రీత్ డ్యాన్స్ చేస్తుండగా దుండగులు కాల్చి చంపారు. కాల్పులు జరిపిన అనంతరం అతని వాహనానికి కూడా నిప్పు పెట్టారు.
సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు అమర్ ప్రీత్‌ను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. సీపీఆర్ చేసినా ఉపయోగం లేకుండా పోయింది. అంబులెన్స్ వచ్చే లోపే అమర్ ప్రీత్ ఊపిరి ఆగిపోయింది. కాగా, అమర్ ప్రీత్ కెనడా పోలీసుల వాంటెడ్ లిస్ట్‌లో ఉన్న నేరస్థుడని, ఆయన సోదరుడు రవీందర్ కూడా గ్యాంగ్ స్టరేనని అధికారులు తెలిపారు. కాగా, అమర్ ప్రీత్ వర్గానికి, బ్రదర్స్ గ్రూప్ వర్గానికి మధ్య వ్యాపార వ్యవహారాల్లో వైరం ఉంది.