- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బర్త్‌డే పార్టీకని తీసుకెళ్లి.. మైనర్‌బాలికపై గ్యాంగ్‌రేప్..?
దిశ, చార్మినార్: వాళ్లిద్దరు మైనర్ బాలికలు, మంచి స్నేహితులు.. బర్త్‌డే పార్టీకని వెంటనే తిరిగి వస్తామని స్నేహితురాలు పట్టుబడితే కాదనకుండా వెళ్లింది. అక్కడే ఉన్న ఐదుగురు యువకులు మైనర్‌బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించారు. అందులో ఒక యువకుడు బాలికపై దాడి చేశారు. అనంతరం మద్యం కలిపిన కూల్‌డ్రింక్‌ను తాగించగానే మత్తులోకి చేరుకున్నాక తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ.. మరునాడు ఉదయం ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాలలోకి వెళితే ...
4వ తేదీన సాయంత్రం 7గంటలకు 16 సంవత్సరాల మైనర్‌బాలిక ట్యాబ్లెట్స్కొనడానికి మెడికల్‌షాపుకు వెళ్లింది. అక్కడ తన స్నేహితురాలు మరో 15 సంవత్సరాల మైనర్బాలికను కలుసుకుంది. దీంతో సదరు మైనర్‌బాలిక బర్త్‌డే పార్టీకి వెళ్దామని 16 సంవత్సరాల మైనర్ బాలికకు పట్టుబట్టింది. తాను రానని చెప్పిన వెంటనే వచ్చేదామని బోయిగూడ లోని ఓ ఇంటికి తీసుకువెళ్లింది.
అప్పటికే అక్కడ ఉన్న తన బాయ్ ఫ్రెండ్‌తో పాటు మరో ఐదుగురు స్నేహితులు ఉన్నారు. బాయ్ ఫ్రెండ్తన గర్ల్ ఫ్రెండ్‌ను తీసుకుని అదే ఇంట్లో పక్కకు తీసుకువెళ్లాడు. బర్త్‌డే పార్టీకి బలవంతంగా వచ్చిన మైనర్‌బాలికపై మిగతా ఐదుగురు యువకులు అసభ్యకరంగా ప్రవర్తించాడు.
దానికి ఆమె నిరాకరించడంతో పాటు గట్టిగా ఏడ్వడం మొదలుపెట్టింది. దీంతో శబ్దం బయటికి పోవద్దన్న ఉద్దేశ్యంతో సదరు యువకులు మ్యూజిక్ సిస్టమ్‌ను పెద్దగా పెట్టారు. తనకు మంచినీరు ఇవ్వాలని ప్రాధేయపడితే ఓ కూల్డ్రింక్బాటిల్ఇచ్చి తాగించారు. కాసేపటికే మత్తుగా అనిపించడంతో మైనర్‌బాలిక నిద్రలోకి జారుకుంది. మరునాడు ఉదయం లేచి చూసే సరికి అర్ధనగ్నంగా కనిపించింది.
వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయి తన తల్లికి జరిగిన విషయాన్ని చెప్పుకుంటూ భోరుమంది. దీంతో సదరు బాధిత కూతురితో కలిసి ఈ నెల 5వ తేదీన ఛత్రినాక పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే కేసును నమోదు చేసుకుని ఛత్రినాక పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
అక్కడి నుంచి భరోసా సెంటర్‌కు తరలించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆరుగురు యువకులతో పాటు వెంట తీసుకెళ్ళిన తన స్నేహితురాలు మైనర్‌బాలికపై ఐపిసి 341, 342, 323, 376(2) రెడ్‌విత్109, సెక్షన్5 రెడ్‌విత్ 6 ఫోస్కో చట్టం తో పాటు సెక్షన్3(1)కింద ఎస్సిఎస్టి కింద కేసులు నమోదు చేశారు.
అసలు సదరు మైనర్‌బాలికపై అత్యాచారం జరిగిందా ? లేదా ? అన్నది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వెంట తీసుకెళ్లిన మైనర్ బాలిక ఉద్దేశ్య పూర్వకంగానే తీసుకెళ్లిందా? తనకు తోడుగా వెంట తీసుకెళ్లిందా? అనే విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఈ కేసును ఛత్రినాక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి : మాజీ మహిళా నేతపై కీలకనేత లైంగికదాడి.. నిందితుడిపై నో యాక్షన్?