ద్విచక్ర వాహనాలకు నిప్పంటించిన గుర్తుతెలియని వ్యక్తులు..

by Sumithra |
ద్విచక్ర వాహనాలకు నిప్పంటించిన గుర్తుతెలియని వ్యక్తులు..
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : నాలుగు ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధమైన ఘటన సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దూరు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలోని బ్లాక్ నెంబర్ 33 వద్ద అంకం సందీప్ కు చెందిన హీరో గ్లామర్, ముత్యాల రాజుకు చెందిన హీరో హెచ్ఎఫ్ డీలక్స్, చీరాల ఈశ్వరయ్యకు చెందిన హోండా, మైలారం రామయ్యకు చెందిన టీవీఎస్ ఎక్స్ఎల్ నాలుగు ద్విచక్ర వాహనాలకు ఆదివారము అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు నిప్పంటించారు. పెద్దయెత్తున మంటలు ఎగిసిపడడంతో స్థానికులు నీళ్లతో ఆర్పే ప్రయత్నం చేయగా మంటలు అదుపులోకి రాలేదు. దాంతో నాలుగు ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed