- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బుమ్రా గురించి నా మనవళ్లకు చెబుతా : ట్రావిస్ హెడ్
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రాపై ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ ప్రశంసలు కురిపించాడు. గ్రేటెస్ట్ ఫాస్ట్ బౌలర్లలో ఒకడని కితాబిచ్చాడు. బుమ్రాతో కలిసి క్రికెట్ ఆడానని తన మనవళ్లకు గర్వంగా చెబుతానన్నాడు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ..‘క్రికెట్ ఆడిన ఫాస్ట్ బౌలర్లలో బుమ్రా అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్. బుమ్రా లాంటి సవాల్ విసిరే బౌలర్‌ను ఎదుర్కోవడం ఆనందంగా ఉంది. నేను అతన్ని ఎదుర్కొన్నానని నా మనవళ్లకు చెబుతా. అతన్ని మరికొన్ని సార్లు ఎదుర్కొవాలని ఆశిస్తున్నా.కానీ, అతను కచ్చితంగా గట్టి పోటీదారుడు.’అని హెడ్ చెప్పుకొచ్చాడు.
కాగా, టెస్టుల్లో బుమ్రా, హెడ్ నాలుగు సందర్భాల్లో ఎదురుపడగా.. హెడ్‌ను మూడుసార్లు అవుట్ చేశాడు. బుమ్రా బౌలింగ్‌లో హెడ్ 22.3 సగటుతో 67 రన్సే చేశాడు. మరోవైపు, ఈ ఏడాది భీకర ఫామ్‌లో ఉన్న బుమ్రా ఆసిస్ గడ్డపై కూడా అదే జోరు కొనసాగిస్తున్నాడు. తొలి టెస్టులో 8 వికెట్లు పడగొట్టి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.