IPL 2025 : పంత్ లేదా పూరన్?.. లక్నో కెప్టెన్‌పై ఓనర్ రియాక్షన్ ఇదే

by Harish |
IPL 2025 : పంత్ లేదా పూరన్?.. లక్నో కెప్టెన్‌పై ఓనర్ రియాక్షన్ ఇదే
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్‌ను రిషబ్ పంత్ నడిపిస్తాడని వార్తలు వస్తున్నాయి. అయితే, విండీస్ బ్యాటర్ నికోలస్ పూరన్‌ కూడా పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. లక్నో పూరన్‌ను(రూ.21 కోట్లు) రిటైన్ చేసుకోగా.. వేలంలో పంత్‌ను రూ. 27 కోట్ల రికార్డు ధరకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా కొత్త కెప్టెన్‌పై ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గొయెంకా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.కెప్టెన్‌పై నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు. అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలన్నాడు.‘నేను సర్‌ప్రైజ్‌లు ఇవ్వను. కెప్టెన్‌ను ఎంపిక చేశాం. మరికొన్ని రోజుల్లో ప్రకటిస్తాం.’ అని తెలిపాడు.

అలాగే, వేలంలో పంత్‌కు భారీ ధర పెట్టడంపై మాట్లాడుతూ. ‘ఢిల్లీ క్యాపిటల్స్ శ్రేయస్ అయ్యర్ కోసం రూ.26.50 కోట్ల వరకు బిడ్ వేసింది. వారు తమ నం.1 ప్లేయర్ కోసం ఆ బడ్జెట్‌ను కలిగి ఉన్నారని అర్థమైంది.అలాగే, రిషబ్‌పై పార్త్ జిందాల్‌కు ఉన్న విపరీతమైన అభిమానం నాకు తెలుసు. కాబట్టి, అయ్యర్‌పై ఖర్చు చేసే దానికి కంటే కొంచెం ఎక్కువ ఖర్చు చేస్తారని తెలుసు. అందుకే, రూ.27 కోట్ల బిడ్ వేశాం.’ అని చెప్పాడు. అలాగే, వచ్చే సీజన్‌లో పంత్ బ్యాటింగ్ స్థానంపై స్పందిస్తూ.. మార్‌క్రమ్, పంత్ ఓపెనింగ్ చేసే అవకాశాలు ఉన్నాయన్నాడు.‘మార్‌క్రమ్-పంత్, మార్ష్-పంత్, మార్‌క్రమ్-మార్ష్. మాకు ఓపెనింగ్ ఆప్షన్లు ఉన్నాయి. కానీ, పంత్ నం.3లో వస్తాడా? లేదా నం.2లో వస్తాడా? అనేది అతని నిర్ణయమే’ అని చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed