Asthma treatment: ఆస్తమాకు కొత్త చికిత్స.. 50 ఏళ్ల తర్వాత మరో కొత్త విధానం

by Kanadam.Hamsa lekha |
Asthma treatment: ఆస్తమాకు కొత్త చికిత్స.. 50 ఏళ్ల తర్వాత మరో కొత్త విధానం
X

దిశ, ఫీచర్స్: అన్నీ కాలాల్లో మనిషిని ఇబ్బంది పెట్టే ఆరోగ్య సమస్య ఆస్తమా మాత్రమే. గాలి కాలుష్యం పెరిగిపోవడంతో రోజురోజుకి ఆస్తమాతో బాధపడే వారి సంఖ్య పెరిగిపోతుంది. ఇది తీవ్ర శ్వాసకోశ వ్యాధులకు కారణంగా మారి చాలామంది ప్రాణాలను కూడా తీస్తుంది. ఈ సమస్యకు ఇప్పటి వరకూ సరైన ట్రీట్‌మెంట్ అనేది లేదు. ఆస్తమాతో బాధపడేవారికి ఆహారం, జీవనశైలిలో మార్పులు వంటి వాటి ద్వారా ఇప్పటి వరకు వైద్యం అందిస్తున్నారు. అయితే, తాజాగా ఆస్తమా చికిత్సకు సైంటిస్టులు కొత్త విధానంను కనుగొన్నారు. దాదాపుగా 50 ఏళ్లపాటు శ్రమించిన తరువాత ‘బెన్‌రాలిజుమాబ్’ అనే మందును కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు తెలియజేశారు.

ప్రపంచవ్యాపంగా ఆస్తమాతో బాధపడుతున్న లక్షలాది మందికి ఈ కొత్తమందు ఉపయోగపడుతుందని సైంటిస్టులు తెలిపారు. ఈ బెన్‌రాలిజుమాబ్ అనే మందు ఊపిరితిత్తుల వాపును తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది పూర్తిగా సురక్షితమైన ఔషధమని చెబుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్టెరాయిడ్ మందుల కంటే ఇది మరింత ప్రభావవంతంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఈ పరిశోధన ట్రయల్స్ కోసం 158 మంది ఇందులో పాల్గొన్నారు. ఈ మందును వాడిన తరువాత మూడు నెలల పాటు వారి ఆరోగ్యాన్ని శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఈ ట్రయల్స్‌లో స్టెరాయిడ్స్ తీసుకున్న వారిలో 74 శాతం మంది రోగులకు చికిత్స విఫలమైంది. అయితే, కొత్త విధానంలో చికిత్స తీసుకున్న వ్యక్తులకు ఆస్తమా లక్షణాలు తక్కువగా ఉన్నాయని తెలిపారు. అయితే, దీనిని విస్తృతంగా ఉపయోగించేందుకు ఈ ఔషధం ఇంకా సిద్ధం కాలేదని చెబుతున్నారు. దీనికి మరో రెండేళ్ల పాటు ట్రయల్స్ జరగాల్సి ఉందని సైంటిస్టులు తెలియజేశారు.

Advertisement

Next Story

Most Viewed