- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Happiness: నిజమైన సంతోషానికి దారెటు..?
దిశ, ఫీచర్స్: సంతోషం అంటే అది ఇష్టమైన అనుభవం మాత్రమే కానవసరం లేదు. దు:ఖం, సుఖం అనేవి ఏ మాత్రం కాదు. అదొక న్యూట్రల్ ఎక్స్ పీరియన్స్. మనిషి ఏం చేసినా సరే చివరిగా కోరుకునేది సంతోషంగా ఉండడం మాత్రమే. ఆ సంతోషం అనేది ఆస్తి, లగ్జరీ లైఫ్, హోదా ద్వారా లభిస్తుందని చాలామంది అనుకుంటారు. అది ఎంతమాత్రం నిజం కాదని చెబుతున్నారు నిపుణులు. నిజమైన సంతోషం అనేది మనలోనే ఉంటుంది. జీవితంలో ఏదో దక్కితేనే సంతోషంగా ఉంటామనుకుంటే అది కేవలం భ్రమ మాత్రమే. ప్రస్తుతం ఉన్న దాంతో సంతృప్తిగా జీవిస్తూ ఉంటే చాలు అనుకుంటే.. అదే నిజమైన సంతోషం.
పరిస్థితులు ఎప్పటికప్పుడూ మారుతూనే ఉంటాయి. ఏమీ లేకపోయినా సంతోషంగా ఉండాలని బలంగా అనుకుంటే చాలు. విజయం సంతోషాన్ని ఇస్తుంది, ఓటమి బాధను ఇస్తుందని ఎప్పుడూ అనుకోకూడదు. గెలుపు సంతోషాన్ని ఇస్తుందని అనుకుంటే.. ఓటమి ఎదురైనప్పడు బాధపడుతుంటారు. అందుకే ఎప్పుడూ కూడా సంతోషాన్ని బయట వెతుక్కోకూడదు. లక్ష్యాన్ని చేరుకోవాలనే పట్టుదల ఉండాలి. అలాగే ఓటమి ఎదురైనప్పుడు దాన్ని అధిగమించే సత్తువ కూడా ఉండాలి.
నిజమైన సంతోషం అంటే ప్రశాంమైన మనసేనని నిపుణులు చెబుతున్నారు. కొందరు వాళ్లకి ఏమీ లేకున్నా సరే.. ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటారు. అటువంటి వారు ఓటమి కూడా చిరునవ్వుతోనే స్వీకరిస్తారు. సంతోషంగా ఉండాలనేది వ్యక్తిగత నిర్ణయం మాత్రమే. ఎందుకంటే ఇబ్బందులు వచ్చినప్పుడు కుంగిపోవాలా.. చిరునవ్వుతో వాటిని ఎదుర్కొవాలా అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. సంతోషమనే సానుకూల అంశం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కోపం, బాధ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఇది మన దగ్గర ఉన్న వాటిని కూడా దూరం చేసే అవకాశం ఉంటుంది.
సంతోషంగా ఉండాలంటే ముందు అది నిజంగా ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. ఏదో సాధిస్తేనే సంతోషంగా ఉండగలమనేది వాస్తవం కాదు. ప్రస్తుతం ఉన్న వాటిని అనుభవిస్తూ ముందుకు సాగాలి. అది మన ఆలోచనలో ఉంటుంది. సంతోషం అనేది వాయిదా వేయాల్సిన అంశం కాదు.. దాన్ని ఎప్పటికప్పుడే అనుభవించాలి. కావాల్సిన దాని కోసం కృషి చేస్తే.. ఆనందంగా జీవితం గడపవచ్చు. ఆనందాన్ని ఎప్పుడూ కూడా ఏ విషయంతో ముడిపెట్టకూడదు.