- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Ramgopal Varma: రాంగోపాల్ వర్మకు బిగ్ రిలీఫ్.. అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఉత్తర్వులు

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), నారా లోకేశ్, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ (Pavan Kalyan)లపై సోషల్ మీడియా (Social Media)లో ఆసభ్యకరంగా, కించపరిచేలా పోస్టులు పెట్టిన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (Ramgopal Varma)పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ (Anticipatory Bail), ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ.. ఇటీవలే ఆర్జీవీ దాఖలు చేసిన పిటిషన్లపై ఇవాళ ఏపీ హైకోర్టు (AP High Court) విచారణ చేపట్టింది. ఈ మేరకు ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా సోమవారం వరకు అంటే.. ఈ నెల 9 వరకు ఆర్జీవీని అరెస్ట్ చేయొద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.
కాగా, రాజ్యాంగ విరుద్ధంగా తనపై కేసులు పెడుతున్నారని ఆర్జీవీ (RGV) తన పిటిషన్‌లో వెల్లడించారు. తాను కామెంట్ చేసిన వ్యక్తులు కాకుండా.. సంబంధం లేని వ్యక్తులు తనపై కేసులు పెట్టారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలో తనపై ఎఫ్ఐఆర్ (FIR)లు నమోదు చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోర్టుకు విన్నవించారు. ఇప్పటికే ఆర్జీవీ (RGV)పై మూడు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. ఆయన కోసం ఒంగోలు (Ongolu), ప్రకాశం (Prakasam) పోలీసులు బృందాలుగా విడిపోయి తీవ్రంగా గాలిస్తున్నారు. అయినా.. ఆర్జీవీ ఇప్పటి వరకు అజ్ఞాతాన్ని వీడలేదు. తాజాగా, కోర్టు వచ్చే సోమవారం వరకు అరెస్ట్ చేయకూడదంటూ ఆదేశాలు జరీ చేసిన నేపథ్యంలో రామ్‌గోపాల్ వర్మ అజ్ఞాతం నుంచి బయటకు వస్తారో లేదో వేచి చూడాల్సిందే మరి.